MENU

Where the world comes to study the Bible

యేసు క్రీస్తు జననము

 

డానియెల్. బి. వాలెస్

క్రొత్తనిబంధన అసోసియేట్ ప్రొఫెసర్

డల్లాస్ వేదాంత కళాశాల


అనువాదం:రూత్ వినయ్

ఉపోద్ఘాతం

క్రింది వివరాలు క్రీస్తు జననమునకు సంబంధించిన ఆధ్యాత్మిక విషయాల క్రమంలో భాగం. ఇటువంటి విషయాలు చరిత్రను తెలియజేస్తాయి కనుక కొందరికి ఆధ్యాత్మికంగా తోచవు. కాని మనము ఆరాధించే యేసు నిజంగా చరిత్రలో జన్మించాడనేది గమనించాల్సిన వాస్తవం. పశువుల తొట్టె లోని బాలుడు నిజముగా శిలువ మరణం పొందాడు. అంతే వాస్తవంగా మరణించి తిరిగి సజీవుడై లేచాడు. ఇతర మత గ్రంధాలకు భిన్నమైనది బైబిల్.ఎందుకనగా ఇది చారిత్రక పరిశోధనను ఆహ్వానిస్తుంది. ఇటువంటి పరీక్షల నెదుర్కొంటూ దైవకుమారునిగా పిలువబడే క్రీస్తు పట్ల విశ్వాసులమైన మన హృదయాలలో మరి ఎక్కువ ఆధ్యాత్మికతను నాటుతుంది.

యేసు జన్మించిన సంవత్సరం

పాశ్చాత్య దేశాలలో కాలాన్ని యేసు క్రీస్తు జననం ఆధారంగా అంచనా వేస్తారు. కాని ఆయన వాస్తవంగా జీవించాడా? జీవించినట్లయితే ఆయన ఎప్పుడు జన్మించాడు?

కొంత కాలం క్రితం, దేవుడు లేడని నమ్మే ఒక వ్యక్తితో సంభాషించాను. అతడు నాస్తికుడు. ఏదో సామాన్యమైన నాస్తికుడు కాదు. అసలు క్రీస్తు ఉనికే లేదని వక్కాణించే తీవ్రవాది.

నాస్తిక స్నేహితుడు వింతైన విశ్వాసి, గ్రుడ్డి విశ్వాసని నాకనిపిస్తుంది. ఇట్టి నమ్మకంతో అనేకమంది సువార్తికులను అవమానానికి గురిచేశాడు. యేసు క్రీస్తు ఉనికి కేవలం క్రొత్త నిబంధనకే పరిమితం కాదు. క్రైస్తవ విరోధులు సైతం ఆయన జీవించాడని , అత్యద్భుత కార్యాలు చేశాడని గ్రహిస్తారు. మిష్నా వంటి యూదుల ప్రాచీన గ్రంధాల్లో, జోసెఫస్ రచనల్లో మరియు మొదటి శతాబ్ది చరిత్రకారులైన ధాలస్ ,సెరాపియన్, టాకిటస్ అను వారు తమ రచనలలో క్రిస్తు అని పిలువబడే ఒక వ్యక్తి పాలస్తీనా ప్రాంతంలో జీవించినట్లు, పొంతి పిలాతు కాలంలొ చనిపోయినట్లు లిఖించారు. యఫ్.యఫ్.బ్రూస్ అనే బ్రిటిష్ పండితుని మాటలలో చెప్పాలంటే జూలియస్ సీజర్ఎంత చారిత్రాత్మస వాస్తవమో క్రీస్తు కూడా అంతే చారిత్రాత్మక వాస్తవం.

కాబట్టి క్రీస్తు జీవించాడన్నది వాస్తవమైతే ఆయన తప్పక జన్మించి వుండాలి. బైబిల్ లోని సువార్తలు ఏమి చెబుతున్నాయంటే ఆయన హేరోదు మహారాజు మరణానికి కొద్దికాలం ముందుగా జన్మించాడని. హేరోదు రాజు మరణాన్ని ఖచ్చితంగా లెక్క కట్టవచ్చు.హేరోదు చంద్ర గ్రహణం తరువాత చనిపోయినట్లు జోసెఫస్ గ్రంధస్తం చేశాడు. ఇది క్రీ.పూ.4 సంవత్సరం మార్చి 12 లేదా 13 తారీఖుల్లో ఏర్పడింది. అంతేకాక పస్కాపండుగకు ముందే హేరోదు మరణించినట్లు కూడా జోసెఫస్ తెలియజేసాడు. పస్కాపండగ అదే సంవత్సరం క్రీ.పూ 4 సంII ఏప్రియల్ 11 తారీఖున వచ్చింది. జోసెఫస్ ఇతర రచనలు,వివరాల ఆధారంగా హేరోదు మహారాజు మరణాన్ని ఖచ్చితంగా క్రీ.పూ.4 సంవత్సరం మార్చి 29 లేదా ఏప్రియల్ 4 తారీఖుగా లెక్క కట్టవచ్చు.

క్రీస్తు పూర్వం (BC) క్రీస్తు జన్మించాడని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకంగా విభజించి వాడబడుతున్న మన అధునిక క్యాలెండర్ క్రీ. 525 సంII లో రూపొందించబడినది. అప్పటి మొదటి పోప్ పాశ్చాత్య సంఘ ఉపయోగార్ధం ఒక ప్రామాణిక క్యాలెండర్ ను రూపొందించవలసినదిగా జాన్ డయోనైసియస్ (Dionysius) అనే ఒక సాధువును కోరినాడు.దురదృష్టవశాత్తు డయోనైసియస్ క్రీస్తు పూర్వం ,క్రీస్తు శకాలు లెక్కించటంలో సుమారు 4 సంవత్సరాల కాలన్ని పొరపాటుగా అంచనావేశాడు.

 మత్తయి గ్రంధకర్త ప్రకారంగా హేరోదు బేత్లహేములో 2 సంII అంతకంటే తక్కువ వయసున్న పిల్లలందరిని చంపించి వేసినట్లు తెలియజేసాడు. కాబట్టి క్రీస్తు జననము క్రీ.పూ 6 సం తరువాతనే జరిగి వుండాలి.మిగతా ఆధారాల ప్రకారం మెస్సియా అని పిలువబడే వ్యక్తి క్రీ.పూ 5 లొ కాని 4 మొదటి భాగంలొ గాని జన్మించియుంటాడని ప్రస్ఫుటంగా తెలియబడుచున్నది.

నాస్తికుడైన నా స్నేహితుడు ఇట్టి అంచనాలను తేలికగా కొట్టి పారేస్తాడు. "క్రీస్తు పుట్టిన దినాన్ని ఖచ్చితంగా అంచనా వేయలేని మీరు ఆయన జీవించాడని ఎట్లు చెబుతారని ప్రశ్నిస్తాడు? ఇది ఒక మంచి ప్రశ్న. మద్య

మా తల్లిగారి జన్మదినాన అభినందనలు తెలియజేస్తూ "అమ్మా ఇప్పుడు కేక్ మీద ఎన్ని క్రొవ్వొత్తులు పెట్టాలి?"అని అడిగాను. అందుకు మా తల్లి నాకు తెలియదు. నాకు మాత్రం గుర్తులేదని చెప్పింది మిగతా విషయాలు మాట్లాడి ఫోను ముగించాను. నా తల్లి వయసును ఖచ్చితంగా చెప్పలేనుగాని ఫోనులో నా తల్లితో మాట్లాడిన విషయం వాస్తవం. ఆమె వయస్సు ఆమెకే గుర్తు లేదు. అప్పటికీ ఆమె ముసలితనంలో లేదు. అంత మాత్రాన ఆమె ఒక అభూత కల్పన కాదు. కాబట్టి నేను నా తల్లితో మాట్లాడటం కల్పనగా భావిస్తే నీవు చదువుతున్నది అంతా వ్యర్ధం.

యేసు జన్మించిన దినం

రాబోయే డిసెంబర్ 25 గురించి తల్లిదండ్రులు తమ పిల్లలకు వృద్ధుడైన సెయింట్ నిక్ (St. Nick) గురించి ఒక కల్పితమైన కథను చెబుతారు. మనలో కొంతమంది మన రక్షకుని జన్మదినాన్ని జరుపుకుంటాము. కాని అతడు నిజంగా జన్మించాడా?

యేసు జననం డిసెంబర్ 25 తారీఖుననే నిజంగా జరిగిందా? బైబిల్ పండితులు క్యాలెండర్ లోని ప్రతీ మాసాన్ని కూడా ప్రతిపాదించారు. కాని ఎందుకు మనము డిసెంబర్ మాసములోనే యేసు జన్మదినాన్ని జరుపుకుంటాము?

డిసెంబర్ 25 జరుపుకునే సాంప్రదాయం చాలా ప్రాచీనమైనది. హిప్పొలైటస్(Hippolytus) 2 శతాబ్దములో , క్రీస్తు జన్మదినం ఇదే అని వాదించాడు. తూర్పుదేశాలకు సంబంధించిన సంఘాలవారు, జనవరి 6 తేదీని ప్రతిపాదించారు.

కాని 4 శతాబ్దములో, జాన్ క్రిసోస్తం (John Chrysostom) డిసెంబర్ 25 మాత్రమే ఖచ్చితమైన దినమని వాదించాడు.అప్పటి నుండి ఇప్పటి వరకు , తూర్పు సంఘాలు మరియు పశ్చిమాల వారు డిసెంబర్ 25ను అధికారికంగా క్రీస్తు జన్మదినంగా ఆచరింపసాగారు.

నవీ నకాలంలో, సాంప్రదాయకమైన తారీఖు సవాలు చేయబడింది. ఆధునిక పండితులు యేసు జన్మించిన దినాన గొఱ్ఱెల కాపరులు బేత్లెహేము చుట్టు ప్రక్కల వున్న కొండలలో తమ గొఱ్ఱెలను కాస్తున్నట్లుగా సూచిస్తున్నారు. లూకా కొంత మంది గొఱ్ఱెల కాపరులు తమ గొఱ్ఱెలను రాత్రి సమయాన మేపుచుండగా దేవదూత ప్రత్యక్షమైనట్లు వివరించాడు. (2:8).

సాధారణంగా గొఱ్ఱెలను నవంబర్ నుండి మార్చి వరకు ఒక ప్రదేశంలోనే వుంచుతారని కొందరు పండితులు భావిస్తారు. వాటిని రాత్రి సమయంలో పొలంలోకి పంపరు. కాని వాదనకు బలమైన ఆధారం ఏదీ లేదు.

ప్రాచీన యూదులకు సంబంధించిన వివరాల ప్రకారం బేత్లెహేము చుట్టు ప్రక్కల ఉండే గొఱ్ఱెల కాపరులు సంవత్సరమంతా గొఱ్ఱెలను కాయుచుండేవారు. కనుక, డిసెంబర్ 25ను సాంప్రదాయకంగాను మరియు బైబిల్ వివరించిన ప్రకారంగాను సరియైనదేనని గ్రహించగలము.దీనిని వ్యతిరేకించుటకు సరైన ఆధారం ఏదీ లేదు.

బేత్లహేము చుట్టుప్రక్కల గొఱ్ఱెలను ఒక ప్రత్యేక సందర్భముకై పెంచుతారు. అవి సాధారణమైన గొఱ్ఱెలు కావు. అవి అర్పణ కొరకైన గొఱ్ఱెలు. వసంతకాలపు తొలి దినాలలొ వచ్చే పస్కా పండగ కొరకు వాటిని సిద్ధం చేస్తారు.

పాపులైన మానవులకు బదులుగా త్వరలొ బలి కాబడే నిష్కల్మషమైన నిరపాయకరమైన గొఱ్ఱెలను కాపాడే గొఱ్ఱెల కాపరులకు దేవుడు మెస్సియ యొక్క జననాన్ని మొదటిగా ప్రత్యక్షపరిచాడు. వారు శిశువును చూచినపుడు, ఆయనను గూర్చి ముందే ఎరిగియున్నారా? వారు తమ హృదయాలలో బాప్తీస్మమిచ్చు యోహాను తరువాత పలికిన విధంగా "ఇదిగో లోక పాపములను మోసికొని పోవు దేవుని గొఱ్ఱెపిల్ల " అని లోలోపల తలంచి యుండి వుంటారేమో!

అయినప్పటికీ , క్రీస్తు జన్మదినం పలానదినం అని మనము ఖచ్చితంగా చెప్పలేము.కాని శీ తాకాలపు తొలిదినాలలో అయివుండవచ్చనునది సముచితమైన ఊహ. 18 శతాబ్దాలుగా డిసెంబర్ 25 తారీఖు విధంగా క్రీస్తు జన్మదినంగా పిలువబడింది. ఇంతకుమించిన సాక్ష్యాధారాలు లేకుండా జన్మదినాన్ని మార్చడం మంచి నిర్ణయం కాదు.

ఇప్పుడు వున్న అనిశ్చతకు మనము ప్రాచీన సంఘాన్ని తప్పు పట్టవచ్చు. కాని , వీ రు అసలు క్రీస్తు జన్మదినాన్ని ఆచరీంచలేదు. వీ రికి అది అంత ప్రాముఖ్యమైనది కాదు. వీ రు ఆయన యొక్క మరణ, పునరుజ్జీవాల గురించి మాత్రమే శ్రద్ధ కలిగి వున్నారు.

కాని ఆధునిక మానవుడు దాన్ని పూర్తిగ తలక్రిందులు చేశాడు.పశువుల తొట్టిలొ పరుండియున్న ఒక శిశువు హానికరుడు కాదు. ఎటువంటి బెదిరింపులు చేయలేదు. కాని శిలువ మీద మరణిస్తున్న దేవుడు అని పిలువబడుచున్న ఆవ్యక్తే బెదిరించగలడు. ఆయన మన నిర్ణయాన్ని కోరుకుంటాడు. మనము ఆయనను నిర్లక్ష్యము చేయలేము. మనము ఆయనను అంగీకరించాలి లేదా తృణీకరించాలి. మన సందిగ్ధతకు ఏమాత్రం చోటు లేదు.

క్రిస్మస్ సమయంలో నీ యొక్క చలువ అద్దాలను తీసివేసి, దుర్గంధంలో, తీవ్రమైన చలి మరియు వణుకుచున్న జంతువులతొ పశువులతొట్టి దృశ్యాన్ని మరల దగ్గరగా పరిశీ లిద్దాం. జంతువులు పాతనిబంధన బల్యర్పణ విధానాన్ని గుర్తు చేస్తాయి. అవి వాటి మద్య వున్న బాలునికి ఛాయ వలె వున్నవి. ఆయనను విశ్వసించు వారందరును జీవించునట్లుగా ఆయన మరణించుట కొరకే జన్మించాడు.

జ్ఞానుల దర్శనము

క్రీస్తు జన్మించినపుడు తూర్పు దేశపు జ్ఞానులుగా పిలువబడే వ్యక్తులు ఆయనను ఆరాధించుటకు వచ్చిరి. వీ రు జ్ఞానులా లేక జ్యోతిష్కులా?

 మత్తయి 2 అధ్యయాన్ని విధంగా ఆరంభించాడు. "రాజైన హేరోదు దినములయందు యూదయదేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి - యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ నున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి , ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి".

తూర్పు దేశాల నుండి వచ్చిన జ్ఞానులు ఎవరు? మత్తయి వారి గురించి ఎక్కువగా వివరణ ఇవ్వలేదు. వారి పేర్లు ఏవో, వారెంత మందో , దేశాల నుండి వచ్చారో వివరాలు పేర్కొన లేదు. వీ రు విధంగా అనూహ్యంగా వచ్చారో విధంగానే కనుమరుగైనారు.

మత్తయి ఎక్కువగా వివరించనప్పటికీ , అత్యుత్సాహము కలిగిన క్రైస్తవులు సంఘ చరిత్రను ప్రముఖంగా తమ స్వంత అభిప్రాయాలతో నింపేశారు. క్రీ.. 6 శతాబ్ధానికల్లా అజ్ఞాత జ్ఞానులకు కిరీటాలను, జాస్పర్ (Gasper), మెల్కియార్ (Melchior) మరియు బెల్తజార్ (Balthazar) అనే పేర్లను ఇచ్చుటే కాకుండా వారిని రాజులుగా పిలిచిరి.

కాని దీనికి, బైబిల్ కథనానికి ఎటువంటి సంబంధము లేదు.వారి పేర్లను గురించిన వివరాలు లేవు.వారి సంఖ్య కూడా తెలుపబడలేదు. వీ రు నుండి ౩౦౦ వరకు వుండవచ్చు. ఒకటి మాత్రము ఖచ్చితంగా చెప్పవచ్చు. వారు రాజులు కారు. ప్రాచీన కాలపు జ్ఞానులు మతనిష్ట కలిగి , రాజకీయ సలహాదారులుగా తూర్పు దేశాలకు చెందిన రాజుల వద్ద వుండేవారు.కాని వారికి రాజరికపు వారసత్వము లేదు.

కాని జ్ఞానులు జ్యోతిష్కులై ఉఓటారా? మరియు పాతనిబంధనలో దేవుడు జ్యోతిష్కులకు మరణాన్ని నియమించలేదా? ’ప్రతీ సారీ కాదులేకఅవునుఅనే జవాబులు వున్నవి. ద్వితియోపదెశకాండము 17 లో

దేవుడు తన ప్రజలకు జ్యోతిష్కులను రాళ్ళతో కొట్టి చంపవలసినదిగా ఆజ్ఞాపించాడు. ఇటువంటి ఆజ్ఞల ప్రకారం జీన్ డిక్సన్ (Jean Dixon) సిద్ధాంతాలు చాలా వ్యతిరేకమయనవి. కాని ఆమె మరియు ఆమె వంటి ఇతరుల సిద్ధాంతాలను ఎంతో సుళువుగా సహిస్తూ - అటువంటి వారిని మరి ఎక్కువగా గౌరవిస్తూ అమెరికాను (USA) ఒక ఆధునిక క్రైస్తవదేశముగా చూపించగలిగిరి. కానీ ప్రాచీన జ్ఞానుల నేపధ్యం ఏమిటి? వారు జ్యోతిష్కులా? వారు కేవలము నక్షత్రమును వెంబడించి బేత్లహేమునకు వచ్చిరా?

మనము దీనికి విధములుగా సమాధానము తెలుపవచ్చును. మొదటిగా, జ్ఞానులందరూ జ్యోతిష్కులు కారు. ప్రవక్తయైన దానియేలు, నెబుకద్నెజరు ఆస్థానములోని జ్ఞానులందరిలో ముఖ్యుడు. ఆయన వలన ప్రభావితము చేయబడిన అనేక జ్ఞానులు మతపరమైన మరియు రాజకీయ వ్యవహారాలు చూస్తూ నిజమైన దేవుని ఆరాధికులుగా వుండిరి.

రెండవదిగా, మెస్సియా జన్మించినపుడు ఒక తార దర్శనమిచ్చునని యెషయ ప్రవక్త ముందుగానే ప్రవచించినట్లు కొందరు బైబిల్ పండితులు విశ్వసిస్తారు. వీ రు చెప్పేది సత్యమైతే నూతనంగా జన్మించిన శిశువును ఆరాధించుటకు జ్ఞానులు తప్పక దానియేలు రచనలననుసరించి నడిచి , యెషయా ప్రవచనాల ఆధారంగా వచ్చి వుంటారు.

మూడవదిగా , కొందరుతారప్రత్యక్షమగుట ఒక సాధారణ సంగతిగానే విశ్వసించినప్పటికి - శని, బృహస్ఫతి కలయిక వల్ల ఏర్పడే నక్షత్రము బేత్లహేము పైననే విధముగా వచ్చి ఆగినదని వివరించలేము. స్పష్టముగా నక్షత్రము పూర్తిగా మానవాతీతముగా అవతరించినది. అట్లయిన దానికి జ్యోతిష్యముతో సంబంధం లేదు.

కనుక జ్ఞానులు ఇటువంటి మూఢనమ్మకాలను అనుసరించలేదు కాని వారు నిజముగా జ్ఞానము కలిగినవారు.

ఒకదినమున నేను ఒక పెద్ద స్తిక్కరును చూచాను. దానిపై ఇలా వ్రాయబడింది "జ్ఞానులు ఇంకను ఆయనను వెదుకుచున్నారు". నిజముగా అది సరిగా చెప్పుటలేదు. బైబిల్ విధముగ చెప్పుచున్నది. "ఎవరూ దేవుని వెదుకుట లేదు,ఒక్కరు కూడా" .కాని ఆయన తనకు తానుగా నడిపిస్తే , మనము జ్ఞానులము కాగలము. ఎందుకనగా "జ్ఞానులు ఆయనను ఆరాధింతురు." అనునది సత్యము.

బేత్లహేములోని మగ పిల్లలు

హేరోదు బేత్లెహేము లోని చిన్న బిడ్డలను వధించుట మానవ చరిత్రలోనే అతి పాశవికమైన చర్యగా చెప్పబడుచున్నది. కాని అది నిజంగా సంభవించినదా?

మత్తయి సువార్త 2 అధ్యాయములో , రాజైన హేరోదు ,మెస్సీయా యొక్క జననము గురించి విన్నాడని మనము చదివియున్నాము. " సంగతి వినినప్పుడు అతడును,అతనితో కూడా యెరూషలేము వారందరును కలవరపడిరి". తరువాత జ్ఞానులు తనకు సమచారము తిరిగి వచ్చి తెలియచేయలేదు.కనుక అతడు ఆగ్రహము తెచ్చుకొని బేత్లెహేములోను దాని చుట్టు ఉన్న ప్రాంతములొను, రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సుగల మగపిల్లలమదరును వధించబడవలెనని ఆజ్ఞాపించెను.

క్రూరమైన సంఘటన విషయమై ఆలోచనచేసినచో ప్రశ్నలు స్ఫురస్తాయి : మొదటిది - ఎంతమంది మగపిల్లలను హేరోదు చంపించాడు? రెండవది - ఇది జరిగినపుడు యేసు ఎంత వయస్సు వాడు? చివరగ - ఎందుకు ఇతర చరిత్రకారుడు దారుణ సంఘటనను ప్రస్తావిమచలేదు? మరో మాటలో చెప్పాలంటే , ఇది వాస్తవంగా జరిగినదా?

ఎంతమంది మగపిల్లలను హేరోదు హతము గావించాడు? కొంతమంది పండితులు 200 వరకు అని అంచనా వేశారు! కాని ఎక్కువ మంది సంఖ్యను వ్యతిరేకించారు. బేత్లహేము చాలా చిన్న ఊరు. అది యెరూషలేము పొలిమేరలలొ ఉన్నది. గ్రామము మరియు చుట్తుప్రక్కల ప్రాంతాలలొ కలిపి రెండు సంవత్సరాల లొపు మగపిల్లలు సుమారు ౩౦ వరకు వుండి వుంటారు. ఎక్కువ మంది పండితులు వీ రి సంఖ్య 20 నుండి ౩౦ వరకు వుండవచ్చని అంటారు.

కాని అది కేవలము చంపబడిన మగ పిల్లల సంఖ్య మాత్రమే. వాస్తవంగా గ్రీకు బాషలో మత్తయి 2:16 ప్రకారముపిల్లలుఅనగా వారు మగవారే అయివుండనవసరం లేదు. హేరోదు కూడా మనస్తత్వపరంగా వారి లింగ భేదాన్ని పట్టించుకొని వుండకపోవచ్చు. కాబట్టి వీ రి సంఖ్య 50 లేక 60 వరకు వుండవచ్చును.

రెండవదిగా, అది జరిగినపుడు యేసు వయసెంత? చరిత్రలోని సాక్ష్యాల ఆధారంగా ,అయనకు లేక 4 నెలల ప్రాయము వుండవచ్చు. ఆయన క్రీ.పూ 5 లేక 4 సంII లోని శీ తాకాలములో జన్మించియుండవచ్చును. హేరోదు క్రీ.పూ 4 సంII వసంతకాలపు తొలి దినాలలో మరణించాడు. కనుక ఎందుచేత రెండు సంవత్సరాల లోపు పిల్లలను వధించాడు? 3 ప్రశ్న యొక్క సమాధానము దీనికి సహాయకరముగా వుండునేమో...

మూడవదిగా, సంఘటన బైబిల్ తప్ప ఇతర గ్రంధాలలో ఎందుకు వ్రాయబడలేదు? మొదటి శతాబ్దపు యూదా చరిత్రకారుడు జోసెఫస్ ఎందుకు ప్రస్తావించలేదు?

జోసెఫస్ మనకు హేరోదు గురించి చాలా వివరాలు తెలియచేస్తాడు. అతన పాలననువివరించే సరియైన మాట ఏదంటే "అతిగా చంపుట". అతడు తన ప్రియమైన భార్య యొక్క తండ్రిని సంహరించాడు. ఆమె సోదరుడిని నీటిలో ముంచి చంపాడు. చివరకు ఆమెను కూడా వధించాడు. అత్యంత నమ్మక పాత్రుడైన స్నేహితుని వురి తీసాడు. అతని మంగలిని మరి యొ ౩౦౦ మంది సైనికులను ఒక్క రోజులోనే చంపించాడు. తన మీద కుట్ర చేస్తారేమోనన్న అనుమానముతో తన ముగ్గురు కుమారులను సంహరించాడు. జోసెఫస్ మాటలలో చెప్పాలంటే

"ఒక జంతువు మనుషులను పాలించుటకు అధికారముంటే జంతువు ప్రవర్తించేదానికి మించి హేరోదు యూదుల పట్ల క్రూరంగా వ్యవహరంచేవాడని (Antiquities of the Jews 17:310) నందు పేర్కొన్నాడు.రెండు సంవత్సరాల లోపు చిన్న పిల్లలను చంపించుట రాజు స్వభావానికి వ్యతిరేకమైనది కాదు. అధికారము కొరకై ద్వేషముతో బాలుడైన యేసును చంపించుటకు పని చేసి వుండవచ్చును.

చిన్న బిడ్డలను వధించే సంఘటన విషయమును జోసెఫస్ పేర్కొనక పోవుటకు గల కారణాలు : మొదటిది- అతనికి క్రైస్తవత్వంతో ఎలాంటి స్నేహం లేదు కనుక కావాలనే విషయాన్ని వదిలేసి వుండవచ్చును. రెండవది- హేరోదు మరణించక ముందు దేశములోని ప్రముఖులను బంధించి వారినందరిని తాను మరణించకముందే వురి తీయమని ఆజ్ఞాపించెను. అతడు మరణించిన పిమ్మట సంతాపాన్ని అచరంచాలని హేరోదు విధంగా చేశాడు. ఇశ్రాయేలులో బహుశా సంఘటనల వలన కొందరు చిన్న బిడ్డల మరణం మాత్రమ ప్రాముఖ్యము లేనిదిగా మరుగున పడియుండవచ్చు.

హేరోదు , యూదుల రాజు పైన తాను విజయము సాధింవానని తలంచాడు.రోమావారి శిలువపై యేసు మరణాన్ని సాతాను విజయముగా భావించుటకు నీడగా మాత్రమే ఇది వున్నది. కాని ఖాళీ సమాధి నిశీధ శుక్రవారమునాటి సాతాను యొక్క అపజయమును ఋజువుచేయుచున్నది.

ముగింపు

సంక్షిప్త పఠనంలో మనము యేసుక్రీస్తు యొక్క జననానికి సంబంధించి అనేక విషయాలను గమనించాము.ఇప్పుడు వాటినన్నటిని ఒక చొట కూర్చుదాం.

క్రీ.పూ. 5 లేక 4 సంII శీ తాకలంలో , దేవుడు మానవ రూపంలో చరిత్రలొ దక్షిణ యెరూషలేములో చిన్న పట్టణంలో జన్మించాడు..బేత్లేహేము , అనగారొట్టెల యిల్లు’ . పేరుకు తగినట్లుగా శీ తాకాలపు రాత్రిలో సత్రములో స్ధలము లేనందున రాజు యొక్క జననమును రాత్రి కేవలము అతని తల్లి, ఆమె భర్త మరియు కొందరు గొఱ్ఱెల కాపరులు మాత్రమే ఆచరించిరి. కాపరులు బేత్లేహేము చుట్టు ప్రక్కల పొలాలలో గొఱ్ఱెలను కాయు చుండగా వారికి దేవదూత ప్రత్యక్షమై క్రీస్తు జనన విషయాన్ని ప్రకటించింది. "దావీ దు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు"(లూకా 2:11). వారు తమ కొద్ది విశ్వాసంతో అప్పుడే జన్మించిన శిశువును దర్శించుటకు వెంటనే వెళ్ళిరి.

మెస్సియా జన్మించిన కొన్ని దినాలకు , తూర్పు నుండి కొందరు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి రాజైన హేరోదును యూదుల రాజుగా పుట్టిన వాని గురించి విచారణ చేసిరి. హేరోదు ఆస్థానములోని లేఖనాలను బాగుగా ఎరిగినవారు - బేత్లేహేమందుజన్మిస్తాడను వారు వెల్లడించిరి. లేఖనములు తెలిసినప్పటికి వాటిని వారు నమ్మలేదు. వారు ఆరు లేక ఏడు మైళ్ళ దూరములో గల బేత్లెహేమునకు ప్రయాణించి మెస్సియాను చూడలేకపోయిరి.

కాని హేరోదు లేఖనాలను నమ్మాడు! అందుకే అతడు తన సైనికులను పంపించి బేత్లెహేము నందలి చిన్న బిడ్డలను వధించుటకు ఆజ్ఞ ఇచ్చాడు. తన సింహాసనానికి వ్యతిరేకంగా వున్న వారిని నాశనం చేయాలని ఆశించాడు. కాని అప్పటికే ఆలస్యం అయ్యింది . జ్ఞానులు వచ్చి,వెళ్ళిపోయారు. మరియు యేసు క్షేమంగా ఈజిప్టునకు చేరుకున్నాడు.

జ్ఞానులు లేఖనాలను విశ్వసించారు! వారు శిశువును ఆరాధించుటకు కొన్ని వందల మైళ్ళు ప్రయాణం చేశారు. ఒక మానవాతీతమైన పరలోక సంబమధమైన ఆనవాలు వారిని బేత్లెహేము వరకు నడిపించింది.మరియు లేఖనాల ఆధారంగా వారు శిశువును చూచినపుడు , సాగిలపడి ఆరాధించిరి. ఇతడే శరీరధారియైన దేవుడు,వేరెవ్వరూ కాదు.

మరియు వారు బంగారము,సాంబ్రాణి మరియు బోళములను కానుకలుగా అర్పించిరి. విధంగా చూచినా అవి చాలా అరుదైన కానుకలు.బంగారము గురించి మనకందరకూ తెలియును. కాని బొళము , సాంబ్రాణి చాలా అరుదైనవి. బహుశా వారు యెషయా ప్రవక్త యొక్క ప్రవచనాలను చదివియుంటారు. "జ్ఞానులు నీ వెలుగునకు వచ్చెదరు. రాజులు నీ ఉదయకాంతికి ... బంగారమును ధూపద్రవ్యమును తీసుకొని వచ్చెదరు. (యెషయా60:36) ఇది సాంబ్రాణి గురించి వివరించుచున్నది.

బోళము కూడా సాంబ్రాణి వలె సుగంధ ద్రవ్యము. కాని సాంబ్రాణి వలె కాకుండా బోళమును మరణపు వాసనగా భావింతురు. ప్రాచీన కాలములో ,అది శవాలను భద్రపరచుటకు ఉపయోగింపబడేది. యేసు సుగంధ ద్రవ్యముచే భద్రపరచబడినాడు (యోహాను 19:39).

జ్ఞానులు యేసు మరణాన్ని ముందే ఊహించి బోళమును కానుకగా అర్పించిరి. కనుక వారు దానియేలు ప్రవచనాలను (దానియేలు 9:24-27)ఎరిగి యున్నారనుట నిస్సందేహము. దానియేలు 7 అద్యాయములోఅభిషక్తుడు నిర్మూలనము చేయబడునుమరియునిబంధనను స్థరపరచునుమరియు చివరగాయుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరుచును’(దానియేలు 9:24-27).

రక్షకుడు జన్మించినపుడే , సిలువ యొక్క నీడ అతని ముఖము పై ప్రసరంచినది......

హేరోదు ఆస్థానములోని ధర్మ శా(స్త ప్రవీ ణులు లేఖనాలను విశ్వసించలేదు. వారు అవివేకులు. హేరోదు విశ్వసించినప్పటికీ ,సామాన్యులైన గొఱ్ఱెల కాపరులు మరియు ఘనులైన జ్ఞానులు రక్షకుడైన శిశువును విశ్వసించిరి. అది వారికి నీతిగా ఆపాదించబడినది. మనము కూడా వారిని వెంబడిద్దాం.

సమాప్తం

   

Report Inappropriate Ad