MENU

Where the world comes to study the Bible

[క్రైస్తవ విశ్వాసపు ప్రాథమిక సత్యాలు -1] బైబిల్ - దేవుని వాక్యం

Related Media

ఉపోద్ఘాతము:

“లేఖనములు : బైబిల్ దైవావేశము తో దేవుని నుండి పలుకబడిన వాక్కు అనియు దాని మూల రచనలు దోషరహితమైనవనియు సిద్ధాంతము మరియు అనుచరణకు అంతిమ ఆధికారము కలదనియు నమ్ముచున్నాము.

‘పెరేడ్’ అనే మ్యాగజైన్ లో కార్ల్ సాగన్ అనే వ్యక్తి క్యాన్సర్ తో తన అనుభవాన్ని తెలియజేసాడు. ఆయనకు పునర్జన్మ మీద నమ్మిక లేదు. క్రైస్తవులు , ముస్లిములు , యూదులు మరియు హిందువులు ఆయన గురించి ప్రార్ధించినట్లు

తెల్పినాడు. “ దేవుడు ఉన్నట్లయితే ,ప్రార్ధన ద్వారా ఆయన ప్రణాళిక మారగలిగినదైతే నేను ఆయనకెంతో కృతజ్ఞుడిని” . కార్ల్ సాగన్ ఖగోళ శాస్త్రాన్ని చదివాడు. ఈ దినాలలో విశ్వమంతటి మీద అధికారం ఆయనకు కలదు . కాని తన విద్య సృష్టికర్త ఐన దేవునిని ఆరాధించకుండా త్రుణీకరించేలా చేసింది. అంతే కదా ! రోమా 1:18 – 20 చెప్పుచున్నది కాదా?

రోమా 1:18 20 చదవండి.

సృష్టి ద్వారా దేవుడు వున్నాడనియు ఆయన అనంత శక్తిగలవాడనియు మనము తెలుసుకోగలము. కాని దేవుడు దానికంటే మరి ఎక్కువగా తనను తను ప్రత్యక్షపరుచుకున్నాడు.

హెబ్రీయులు 1:1-2 చదవండి.

ఆయన ప్రవక్తలద్వారా తన మాటలను పలికించాడు. కాని ఆయన చివరిగా మరియు సంపూర్తిగా తన ప్రత్యక్షతను తన కుమారుని ద్వారా వెల్లడిపరిచాడు. దేవుడు ఎలా ఉంటాడో యేసు ద్వారా తెలియబడుచున్నది. ఆయన ఎలా ఆలోచించే వాడో ,ఎలా స్పందించే వాడో మరియు ఆయన కార్యములు దేవుడు వీటినన్నిటిని బైబిల్ నందు భద్రపరిచాడు. దేవుని గురించి మనమేమి విశ్వసిస్తున్నామో దానికి మూలము బైబిల్. క్రీస్తు , మానవత్వం ,రక్షణ ,పరలోకం ? మనకు గల అధికారం?

మనము ఎందుకు బైబిల్ ను విశ్వసించాలి ? మన జీవితాన్ని నియంత్రిస్తూ మనలను అధికారపూర్వకంగా నడిపిస్తున్నదనటానికి ఋజువు ఏమిటి?

బైబిల్ గ్రీకు పదమైన బిబ్లోస్ (biblos) అనగా పుస్తకము , బిబ్లియా (biblia) అనగా పుస్తకములు నుండి వచ్చినది. బైబిల్ అన్న పదం బైబిల్ లో ఎక్కడా ఉపయోగించలేదు.

బైబిల్ విశిష్టమైన దేవునివాక్యం గల పుస్తకం

బైబిల్ దేవునివాక్యం గల విశిష్టమైన పుస్తకం అనుటకు 2 ఋజువులు కలవు. అవి బాహ్యమైన మరియు అంతర్గతమైన ఋజువులు.

బాహ్యమైన ఋజువులు External evidence

1. బైబిల్ యొక్క నిరంతరత (The continuity of the Bible)

దాదాపు 40 మంది రచయితలచే సుమారు 1600 సంవత్సరాల కాలంలో రచింపబడినను అది ఒకే పుస్తకమైయున్నది కాని అనేక పుస్తకముల కూర్పు కాదు. రచయితలలో రాజులు,సామాన్యులు,తత్వజ్ఞానం కలవారు, జాలరులు, వైద్యుడు, పన్నులు వసూలు చేసే అధికారి, రాజనీతిజ్ఞులు,కవులు మరియు రైతులు వున్నారు.

ఇటలీ, గ్రీసు,బబులోను, పర్షియా మరియు ఇశ్రాయేలు మొదలైన అనేక దేశాలలో

వ్రాయబడింది. ఈ రచయితలు వేర్వేరు సాంస్కృతిక నేపధ్యం గలవారు మరియు విభిన్నమైన అనుభవాలు కలిగి వుండిరి. వారందరూ తమ తమ స్వభావాల్లో మరియు వ్యక్తిత్వాల్లో విభిన్నమైనవారు.

వారు 3 భాషలలో వ్రాశారు. పాతనిభంధన : హీబ్రూ, అరామీ భాషలలో, క్రొత్తనిభంధన : గ్రీకు భాషలో

కాని బైబిల్ విభిన్న రచయితలతో వ్రాయబడిన సంకలనం (anthology) కాదు.ఆదికాండము నుండి ప్రకటన వరకు అద్భుతమైన కొనసాగింపు మరియు ఏకత్వము కలదు.

స్వర్గాన్ని కోల్పోవుటతో ఆరంభమయ్యే ఆదికాండము స్వర్గాన్ని తిరిగిపొందే ప్రకటన

గ్రంధంతో ముగుస్తుంది. జీవవ్రుక్షానికి ద్వారాన్ని మూసివేయుట ఆదికాండములో చెప్పబడితే ,దానిని ఎప్పటికీ తెరిసివుంచడాన్ని ప్రకటనలో చూడగలము. (Geisler & Nix . Evidence that demands verdict P19)

సిద్ధాంతము క్రమమైన రీతిలో తెలియజేయబడుతూ వచ్చింది.రక్షణ గూర్చి .కా 3 లో ప్రస్తావిన్చబడగా , అనేక వాగ్ధానాల చిత్రీకరణల ద్వారా పాతనిభంధనలో రూపొందింపబడగా , సువార్తలలో సాధ్యపడింది. పత్రికలలో వివరించబడింది.ప్రకటన గ్రంథంలో మహిమకరంగా ముగించబడింది.

2. బైబిల్ ప్రత్యక్షతల విస్తృతి (The extent of biblical revelation)

బైబిల్ లోని రచనలన్నీ మానవ జ్ఞానానికి సంబంధించిన తొలిదినాల్లో అనగా రచయితలకు నూతన పరిశోధనలు తెలియక ముందే వ్రాయబడ్డాయి.కాని వారు వ్రాసిన విషయాలు తరువాతి పరిశోధనలతో విభేదించలేదు.

యెషయా 40:22 – ఆయన భూమండలము మీద ఆసీనుడైయున్నాడు.

ఇది 2800 సంవత్సరాల క్రితం వ్రాయబడింది.

యోబు 26:7 - శూన్యమండలము పైని ఉత్తర దిక్కున వున్న ఆకాశవిశాలమును ఆయన పరిచెను. శూన్యముపైని భూమిని వ్రేలాడదీసెను.

ఇది 4000 సంవత్సరాల క్రిందట వ్రాయబడింది.

పురావస్తు శాస్త్రవేత్తలు (Archeology) బైబిల్ లో చెప్పబడిన అనేక విషయాలకు ఋజువులు కనుగొన్నారు.(Hittites,Sargon)

3. బైబిల్ యొక్క ప్రచురణ మరియు ప్రభావము (Influence and Publication of Bible)

బైబిల్ వలె ఏ పుస్తకము అనేక భాషలలో ప్రచురింపబడలేదు .ఇప్పటికీ ఎక్కువగా అమ్ముడవుతున్న పుస్తకం . ఫ్రాన్స్ కు చెందిన హేతువాది Voltaire ఒక వంద సంవత్సరాల లోపు బైబిల్ అనబడే పుస్తకము మరుగునపడిపోతుంది. మరియు క్రైస్తవుల ఉనికి తుడిచివేయబడి చరిత్రలో కనుమరుగు అవుతుందని పలికాడు . కాని Voltaire చరిత్రలో కనుమరుగయ్యాడు కాని బైబిల్ ఇప్పటికీ ప్రపంచమంతా వ్యాప్తి చేయబడుతూనే వున్నది. వాస్తవానికి విచిత్రంగా Voltaire మరణించిన 50 సంవత్సరాలకు Geneva Bible Society వారు ఆయన ఉపయోగించిన press మరియి గృహాన్ని అనేక బైబిల్లను ముద్రించే స్థలంగా ఉపయోగించారు. (Evidence P23)

4.రాతప్రతుల ఆధారాలు (Manuscript evidence)

పురాతన రచనల రాతప్రతులతో పోలిస్తే క్రొత్తనిబంధనకు సంభందించి 13,౦౦౦ రాతప్రతుల భాగాలు లభ్యమైనాయి. ప్రతులు కొన్ని 2 శతాబ్ధపు కాలపు నాటివి .

Sir. Frederic Kenyon, director అండ్ principal librarian of the British museum విధంగా అన్నారు: ఏ ఇతర పురాతన గ్రంధానికి కూడా దాని వాక్యభాగానికి సరిపడిన సాక్ష్యాధారాలు లేవు. పక్షపాతము లేని (రహిత) మేధావి కూడా వాక్యభాగం సరైనది కాదు అని తిరస్కరించలేదు.

5. పక్షపాతము లేని బైబిల్ (unprejudiced authority of Bible)

ఈ మానవ రచనలు (మూలముగా) మానవుల పక్షముగా వ్రాయబడలేదు. బైబిల్ నందు ఘనతవహించిన మానవులందరి (అబ్రహాము ,మోషే ,దావీదు ,పేతురు )

పాపములు మరియు బలహీనతలు కూడా వివరించబడియున్నవి.సాతాను మరియు మానవుని(యోబు ) మధ్య జరిగిన తప్పులు మరియు పొరపాట్లు పొందుపరచబడినవి. నేటి మానవుని యొక్క స్వాభావిక ప్రవృత్తి దాని యందు నిక్షిప్తం చేయబడింది.

6. బైబిల్ యొక్క విశిష్టత (The supreme haracter of the Bible)

దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మరియు మహిమను ఆయన కుమారునిలో ప్రత్యక్షపరిచే బైబిల్ ఎంతో అతీతమైనది. మర్త్యమైన మానవుడు యేసుక్రీస్తు వంటి వ్యక్తిని ఎన్నడూ కనుగొనలేడు. మనము ప్రయత్నించి ఆయనను రూపొందించలేము. గ్రీకు పురాణాలలో వారి దేవతలు వారి యొక్క (magnified images) ప్రతిబింబాలైయున్నవి.

బి .అంతరంగిక ఋజువులు (internal evidence)

2 తిమోతి 3:16 -13 చదవండి Theopnestos = God-breathed

క్రొత్తనిబంధనలో ఇక్కడ మాత్రమే ఈ విధంగా వ్రాయబడింది.

లేఖనము దైవావేశపూరితమైనది.

ఈ దైవావేశము రచయితలకు కాదు గాని దేవుని వాక్యానికే సూచిస్తుంది. రచయిలతల పొరపాటు వలన ఏదైనా తప్పు దొర్లివుండవొచ్చును గాని దేవుడు వారి మనస్సులో తన లోప రహితమైన వాక్యాన్ని వుంచాడు. అందుచే వారు రచించిన దేవుని వాక్యం లోపరహితమైనది. మానవులైన రచయితలకు ఎలా వ్రాయాలో దేవుడు ఏవిధంగా తెలిపాడు?యాంత్రికంగా ప్రభోదించుట వలన మాత్రమే కాదు.

చదవండి 2 పేతురు 1:20-21

మానవ మాత్రులైన రచయిత ఒక పడవ లోని ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చునట్లు మానవ మాత్రులైన రచయితలు దేవునిచే గమ్యం వరకూ నడిపించారు .

దేవుడు అనేక మార్గాల ద్వారా తన వాక్యాన్ని ప్రకటించాడు.

నిర్గమ 34:27 : ఈ వాక్యములను వ్రాసికొనుము అని చెప్పినాడు.

యెహోవా వాక్కు ప్రవక్తలకు ప్రత్యక్షమాయెను. : యిర్మియా 1:2 ;హోషేయ 1:1 దర్శనములు మరియు స్వప్నములు దానియేలు 2:1;7:1 ల ద్వారా తెలియజేయబడింది.

కనుక లేఖనములు దేవుని యొక్క సంపూర్ణ అధికారాన్ని మరియు పరిపూర్ణతను తెలియజేయుచున్నవి .

ఆయన ఏ దోషము లేని మరియు లోపరహితమైనవాడు.

ప్రేరణ యొక్క విస్తృతి సమస్త లేఖనము (Extent of Inspiration—ALL Scripture)

ప్రతి యొక్క పదము సమానముగా దేవునిచే ప్రేరితమైనది. నోటిమాట ద్వారా అందించిన పదాలు మరియు సమగ్రమైన భావముతో కూడిన పదాలు . బైబిల్ దేవుని వాక్యాన్ని మాత్రమే కలిగియుండవు కాని , ఆ వాక్యము నీతో మాట్లాడుతుంది.

1 తిమోతి 5:18 – పౌలు లూకా 10 :7 ను ద్వితియోపదేశకాండము 25:4 కి వున్న సమానమైన లేఖనముగా పేర్కొన్నాడు (Graphe)

2 పేతురు 3 :15-16 – పేతురు , పౌలు యొక్క రచనలను ఇతర లేఖనభాగాలతో సమానవైనవిగా పేర్కొన్నాడు.

శబ్ద సంబంధమైన సంపూర్ణ దైవావేశము (verbal plenary inspiration)

నిర్వచనము : పరిశుద్ధాత్ముడు మానవాతీతమైన పరిచర్య ద్వారా

మానవమాత్రులైన రచయితలు లేఖనాలను వ్రాయునపుడు తమ వ్యక్తిగత ఉద్దేశాన్ని ప్రచురపరచకుండా లోపరహితమైన దేవుని ప్రత్యక్షత మానవాళికి వెల్లడియగునట్లు మౌలికమైన రచనలను పర్యవేక్షించాడు.

ఆదిమ రచనలలో మానవ రచయితలు పదాలను ఎంపిక చేసే విషయంలో దేవుని ఆత్మ వారిని నడిపించింది. అనేక పుస్తకాలు రచయిత యొక్క వ్యక్తిగత శైలి భాషాకూర్పు మరియు వారి వ్యక్తిత్వాన్ని కనపరిచే ఆలోచనలు , భావాలు , అనుమానాలు ,ప్రార్ధనలు , భయాలు మున్నగు వాటిని వెల్లడిపరుస్తాయి.

లూకా వైద్యుడు కనుక వైద్యానికి సంభందించిన విషయాలను /పదాలను ఉపయోగించాడు.

పౌలు గ్రీకు భాషలో పండితుడు కనుక గ్రీకు పద్యాలను అక్కడక్కడా ఎత్తిచెప్పాడు. (.కా 17 )

దేవుడు మానవ రచయితలను ఏర్పాటు చేశాడు.

కాని మనుష్యులు వారు వ్రాసే విషయాలను అర్ధం చేసుకోలేకపోయారు. (దానియేలు12:8-9).అయినప్పటికీ ,దేవుని నడిపింపులో వారు 66 పుస్తకాలను రచించారు .ఒక ఏకత్వము మరియు పరిశుద్ధాత్మ యొక్క స్థిరమైన ప్రత్యక్షత వారి రచనలకు తోడ్పడింది.

ధృడమైన అంతర్గత సాక్ష్యము (consistent internal testimony)

బైబిల్ లోని పాత మరియు క్రొత్త నిబంధన భాగాలూ ధృడంగా దేవుని వాక్కును వెల్లడిపరుస్తున్నాయి.

నిర్గమ 20 :1 ; ద్వితియో .కా 6 :6-9; 2 సమూయేలు 22 :31,23 :2; కీర్తనలు 19:7-11 , 11:9,11,18, 89 – 91;97 ,100 ,104-5,13౦ ; సామెతలు 30 :5-6;

యెషయ 55:10-11;22:29; మార్కు 13:31; యోహాను 2:22;5:24;అ.కా 17:11;

2 తిమోతి 2:15 ;1 పేతురు 1: 23-25; ప్రకటన 1:1-3;22:18.

యేసు యొక్క సాక్ష్యము (Testimony of Jesus)

యేసు మరియు పాతనిబంధన (Jesus and the OT)

మత్తయి 5 :18 ; యోహాను 10:35 లేఖనము విడదీయరానిది

ఆయన పాతనిబంధన నెరవేర్పుగా వచ్చాడు మత్తయి 1:22-33; 4:14 ;8:17; 12:17;15:7 ,8 ;21:4-5

కీర్తన 110:1 మరియు మత్తయి 22:43-44 ప్రతిమాట ఎంతో ఖచ్చితమైనది .

పరిశుద్ధాత్ముడు మరియు దావీదు.

లూకా 24 :27 ఆయనకు సంభందించిన లేఖనాలన్నీ ఎంతో ఖచ్చితమైనవి. యోహాను 5:39-40

క్రొత్తనిభంధన లో ప్రాముఖ్యమైన అన్ని భాగాలలో ఆయన పాతనిభంధన వాక్యాలను ఎత్తి చెప్పాడు , ముఖ్యంగా మితవాదులు (liberals) వ్యతిరేకించే పుస్తకాలనుండి ఉదా: ద్వితియోపదేశ కాండము, యోనా,దానియేలు

ద్వి.కా 6: 16 –మత్తయి 4:7 ; యోనా – మత్తయి 12:40; దానియేలు 9:27 ;12:11-మత్తయి 24:15

యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వము మరియు సత్యాన్ని ప్రశ్నించకుండా పాతనిబంధన ప్రేరణను ప్రశ్నించుట అసాధ్యము. క్రీస్తు యొక్క నమ్మకత్వము ప్రధానమైనది. ఆయన ,”నేనే సత్యాన్ని “ అని చెప్పాడు.మితవాదులు అభ్యంతరపడినట్లుగా తన వయస్సుకు సంభందించిన వివాదాన్ని ఆయన లేక్కబెట్టలేదు.

యేసు మరియు క్రొత్తనిభంధన (Jesus and the NT)

క్రొత్తనిభంధన రచనలను యేసు ముందుగానే వెల్లడించాడు. యోహాను 14 :25 – 26 ;15:26-27 ;16:12-13

పరిశుద్ధాత్ముడు మానవమత్రులైన రచయితలకు , పాతనిభంధన రచయితలకు తోడ్పడినట్లే క్రొత్తనిభంధన రచయితలకు తోడ్పడ్డాడు .

బైబిల్ నందు యేసు యొక్క సాక్ష్యము నిర్ణయాత్మకమైనది.ఆయన దేవుడు మరియు పాపరహితుడు అని మనము నమ్మినట్లయితే ఆయన సత్యవంతుడు అని మనము విస్వసించినట్లయితే మనము లేఖనములు ఏర్పరచబడిన విధానము కూడా నిర్దిష్టమైనవి అని అంగీకరిస్తాము. మనకు ప్రతీ విషయము సంపూర్ణంగా అర్థం అవ్వాలని లేదు. అది అంత ముఖ్యం కాదు. నాకు అణుశక్తి గురించి ఏమాత్రం అర్థం కాదు.కాని దాని యొక్క శక్తిని నేను నమ్ముతాను. దాని ప్రభావాన్ని చూచాను. లేఖనముల యొక్క శక్తిని నేను అనుభవించాను. వాటి గురించి పూర్తిగా అర్థం కాకపోయినప్పటికీ!

బైబిల్ సరిగా అర్థం చేసుకునే క్రమంలో మనము గుర్తించవలసినదేమనగా లేఖనములు వెల్లడిచేసే అన్ని విషయాలు మనకు అర్థం కావు కాని బైబిల్ నందు మనకు అర్థం కాగలిగిన విషయాలను చాల అందంగా ఒక క్రమంలో పొందుపరచబడి మరియు దేవుని గూర్చి ఆయన యందలి విశ్వాసాన్ని గూర్చి ఖచ్చితంగా వెల్లడించే ఒకే ఒక్క మూలాధార గ్రంథం. దానియేలు గ్రంథం వలె నేరవేర్చబడిన ప్రవచనం,యేసు యొక్క సాక్ష్యం మరియు సర్వశక్తి మంతుడు ,సర్వజ్ఞుడైన దేవుని ఊపిరి మూలముగా ఏర్పడిన లేఖనాలు ఆయన మనలను ప్రేమిస్తూ తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనలను ఆయన స్వాస్త్యముగా చేసుకున్నాడని బలంగా నమ్మునట్లు పరిశుద్ధాత్మ ఆ లేఖనాలు ఉపయోగిస్తున్నది.కనుక మనము మన విశ్వాసము మరియు నడతపై బైబిల్ కు అధికారము కలదని నమ్మవచ్చును.

బైబిల్ యొక్క అధికారం (Biblical Authority)

నిర్వచనము : దేవుని గుణ లక్షణాలను ,దేవుని చిత్తాన్ని ఖచ్చితంగా మరియు నిశ్చయంగా తెలియపరుచుటలో దైవికమైన శక్తి కలిగినది (దేవుని వాక్యము) బైబిల్.

(లేఖనాలు)బైబిల్ అధికారము కలిగినది ఎందువలనంటే

1. అవి దైవావేశము వలన కలిగినవి (దైవప్రేరితము)

2.పరిశుద్ధాత్మ ప్రేరణ ఆధికారము క్రింద ఎన్నిక చేయబడిన వ్యక్తులచే వ్రాయబడినది.

3.ఈ లేఖనములను దైవత్వములోని రెండవ వ్యక్తియైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిర్ధారించబడినవి.

4.లేఖనాలు పరిశుద్ధాత్మ ప్రేరితము.(ఎఫె 6:17 ,హెబ్రీ 4 :12, 1 తిమో 4 :1). ఆత్మ ఖడ్గము ,జీవము కలిగి శక్తి కలిగిన రెండంచుల వాడిగల ఎటువంటి ఖడ్గము కంటే పదునైనది.

5.లేఖనాల గుణలక్షణాలు నిరూపింపబదినవి.

II తిమో 3 :16-17 (ఫిలిప్స్ ) మరొకసారి చదవండి.

“ దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కర్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును , తప్పు దిద్డుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైయున్నది “.

ప్రామాణికత-కొలబద్ద –కొలమానం

ప్రామాణికత అనగా లేఖన భాగములను(పుస్తకములను) కొలుచుటకు వాడిన ఖచ్చితమైన కొలబద్ద.

ప్రామాణిక పుస్తకంగా చేర్చుటకైన పరీక్షలు.

1.అది అధికారులతో చెప్పబడినదా (ప్రభువు సెలవిచ్చినదేమనగా ...)

2.అది ప్రవచానాత్మకమా (దైవజనులచే వ్రాయబాడినదా ....)

3.అనుమానాలకు తావులేనిదా(అనుమానస్పదముగా వుంటే తొలగించుట )

4.శక్తితో కూడినదా? (అది జీవితములను సమూలముగా మార్చగల దివ్యశక్తి తో కూడినదా )

5.అది దేవుని ప్రజలచే పొందబడి,కూర్చబడి,చదువబడి,ఉపయోగించబడినదా ?

నూతననిభంధన అధికారమునకైన పరీక్ష

అపోస్తులలచే గుర్తింప బడి /నిర్ధరించాబడుట ప్రామాణికత పరీక్ష

అన్వయము (Application)

పై వివరాలు వాస్తవమైతే , దేవుని వాక్యం విషయంలో మన స్పందన ఏంటి ? విశ్వసించుట /నమ్ముట

మనము వాక్యాన్ని నమ్మాలి ఎందుకంటే అది దోషరహితం , నమ్మతగినది మరియు అధికారము కలిగినది.మనము విశ్వసించి నట్లయితే , దానికి విధేయత చూపేట్లు కోరుకొనాలి . దేవుని ప్రీతిపరచుటకు ఇది ఒక్కటే మార్గము..కాబట్టి వాక్యమును చదవాలి. అర్థం చేసుకోవాలి. ధ్యానించాలి.మరియు కంటస్థం చేయాలి. మన మనస్సు లేఖనాలతో సంపూర్ణంగా నింపుకోవాలి. అప్పుడు మాత్రమే వాక్యం విన్నప్పుడు మనలోని లోపాలను గుర్తించగలం. ఈ లేఖనాలు మన తలంపులకు కావలిగా వుండి రక్షిస్తాయి. దీనికోసం మనం శ్రమించాలి. ఇటువంటి క్రియలు అంత తేలికగా జరగవు. దేవుని వాక్యంతో మనం క్రమంగా అర్థవంతంగా గడిపే సమయాన్ని దొంగిలించడానికి మనకొరకు ఒక శత్రువు వున్నాడు. అయితే వాక్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా నిలిచి లేఖనాలను అర్థం చేసుకోనేట్లు సహాయపడతాడు. పరిశుద్ధాత్ముడు ఈ శత్రువు కన్నా గొప్పవాడు. అత్యధిక శక్తి గలవాడు. పరిశుద్ధాత్ముడు నీకు సహాయం అందించులాగు ఆయనపై ఆధారపడవలెను.

లోకం ఏమి చెప్పినప్పటికీ , దేవుని వాక్యం వలన నీతి నియమాలను ప్రవర్తనను నియంత్రించేదిగా వుండాలి. జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో దేవునివాక్యం పై ఆధారపడటం లేక మన సొంత ఆలోచన లేక ఇతరుల ఆలోచన ప్రకారం నడవాలని నిర్ణయం తీసుకొనే అవకాశం మనకు వుంటుంది.

ఏదైనా విషయంలో లేఖనాలచే బోధింపబడి సరిచేసికొనిన సంఘటనలు నీ జీవితంలో ఉన్నాయా? నీ జీవిత గమనాన్ని తిరిగి సరిచేసుకోన్నావా ? లేఖనాలు నిన్ను ఆ దేవుని సేవించుటకు సన్నిద్ధపరుస్తూ ప్రోత్సాహకరంగా ఉన్నాయా ?

లేఖనాలకు విరుద్ధమైన సాజిక నమ్మకాల విషయంలో నీ ఎన్నిక ఎటువైపు ?

ఉదా : గర్భ విచ్చిన్నతి , స్వలింగ సంపర్కం మొదలుగునవి.

నీ లైంగిక కోరికలను తీర్చుకొనుట లేక పరాయి వారితో వివాహేతర సంబంధాల విషయంలో నీ ఎన్నిక ఏమిటి?

కష్టమైన కుటుంబ స్నేహితుల సంబంధాల విషయంలో సరియైన నిర్ణయాలు తీసుకొనుటకు దేవుని వాక్యం ఏవిధంగా సాయ పడుతుంది ?

నీ ఉద్యోగ భాద్యతలను లేఖనాలు ఏవిధంగా ప్రభావితంచేస్తున్నాయి?

ఇతరుల తప్పుల్ని క్షమించుటలో దేవుని వాక్యం నీకెట్లు సాయపడుతుంది?

క్రీస్తులో సంపూర్ణతను సాధించుటకు లేఖనాలు ఎట్లు ఉపయోగపడుతున్నాయి ?

మన జీవితాలకు ఒక దిశ నిర్దేశకుడు , 3400 సంవత్సరములకు పైగా నమ్మకమైన వాడిని కలిగి ఉండుట ద్వారా ప్రజలందరిలో మనమెంతో ధన్యులము. బైబిల్ కు సాటిరాగల పుస్తకము ప్రపంచంలో మరొకటి లేదు.

నిత్యమూ విశ్వసించదగినది దేవుని వాక్యము మాత్రమే . అది ఎన్నడు మనలను చులకనగా ఎంచదు.నిరుత్సాహపరచదు ఎందుకంటే దేవుడు నమ్మతగినవాడు, సత్యవంతుడు .అయితే మన అనుభవంలో వాస్తవము కావాలంటే మనము వాక్యమును నమ్మి విధేయత చూపాలి. ఇది జీవితంలో సంతోషానికి ,ఆత్మీయ ఎదుగుదలకు తాళపు చెవి వంటిది.

ధ్యానానికి ప్రశ్నలు (Study Questions)

రోమా 1:18-21 వరకు చదవండి.

1. మానవ జాతికి దేవుడు తన గురించి తాను ఏమని బయలుపరుచుకున్నాడు?

1 యోహాను 5:9-12 ,యోహాను 1 :18 , హెబ్రీ 1 :1-4 చదవండి

2. మరి ఏ రెండు విధాలుగా దేవుడు తన గురించి తాను ఏమని బయలుపరచుకున్నాడు?

IIతిమోతి 3 :16,17 చదవండి.

3. బైబిల్ లో ఎంత భాగము దైవప్రేరితాలు? ఎంత భాగము మనకు ప్రయోజనకరము ? నీకు ఏదైనా సంఘటనలో బైబిల్ వాక్యాలు ఉపయోగపడిన సందర్భము కలదా ?

II పేతురు 1: 20,21 చదవండి

4. మానవులైన బైబిల్ రచయితలు ఏమి రచించాలో ఎట్లు తెలుసుకొన్నారు? దేవుడు ఉపయోగించిన పద్ధతులు ఏవి?(నిర్గ 34:27 ,యిర్మియా 1 :2, హోషేయ 1:1, దాని 2:1;8:17)?

మత్తయి 5:17,19;యోహాను 10 :35;లూకా 24 :27 చదవండి

5 .పాతనిబంధన పట్ల యేసు ప్రభువు వైఖరి ఏమిటి?ఆయన గుణ గణాలను బట్టి లేఖనాల పట్ల తన వైఖరిని తెలిసుకోనుటలో గల ప్రాముఖ్యత ఏమి?

మత్తయి 1:22,23;4:14;8:17;12:17;15:7,8 ;21:4,5 చదవండి

6. ప్రవచనాల నెరవేర్పు పాతనిబందనను ఏమని ఋజువు చేస్తున్నవి? అవి తు.చ తప్పకుండ నెరవేరుట మన విశ్వాసాన్ని ఎట్లా బలపరుస్తుంది?

యోహాను 14:25,26;15: 26,27;16:12,13 చదవండి

7.కొత్త నిబంధన ఈవిషయంలో ఎలా వ్రాయబడిందని యేసు ప్రభువు ముందుగానే చెప్పియున్నాడు ? కొత్త నిబంధన గ్రంధ మూలకర్త ఎవరు ?

ఎఫె 6:17 ;హెబ్రీ 4:12 చదవండి

8.కొన్ని వందల సంవత్సరముల క్రితము వ్రాయబడిన గ్రంధములలో కెల్లా బైబిల్ ఎట్లు భిన్నమైనది? (ఉదా : షేక్స్పియర్ రచనలు) బైబిల్ గురించి బైబిల్ ఏమని తెలియజేస్తుంది ?

9.పై వివరణ వాస్తవమైతే దేవుని అధికారం పట్ల మన వైఖరి ఎట్లుండాలి ?అది సరైనదని నమ్మగలమా ? ఎంత భాగము అది సత్యము అని అధికారముతో కూడుకొనినదని మనము ఎంచగలము . ఆ వాక్యంతో నీవు ఏమి చేస్తావు? యేహోషువ 1:8; II తిమోతి 2 :1 ; కీర్తనలు 119, 105 ; యాకోబు 1 :22 చదవండి

Translated by Ruth Vinay , ruthvinay(at)gmail.com for bible.org

Related Topics: Bibliology (The Written Word), Curriculum

Report Inappropriate Ad